యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి విష జ్వరాల బారిన పడిన రోగులు సోమవారం మధ్యాహ్నం బారులు తీరారు. ఓపి లైన్లో ఉన్న వారిని పట్టించుకునే వారే లేరని రోగులు సందర్భంగా మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపిల్లలకు, పెద్దవారికి ఒకే డాక్టర్ చూస్తుండడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. రోగులకు టెస్టులు రాసిన కానీ సిబ్బంది సరిగ్గా తెలపడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు.