వరంగల్ జిల్లా నల్లవెల్లి మండలం బుచ్చిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన రైతు దేవ్ సింగ్ కు యూరియా బస్తాల్లో గడ్డలు పొడి వచ్చిన ఘటన చోటు చేసుకుంది. పొద్దంతా లైన్ లో నిలబడి తెచ్చుకున్న యూరియా బస్తాల్లో గడ్డలు పొడి రావడంతో ఆ విధంగా వ్యక్తం చేస్తున్నాడు రైతు దేవ్ సింగ్. ఈ విషయమై యూరియా ఇచ్చిన ఆగ్రోస్ దగ్గరికి వెళ్లి అడిగితే మేము ఏమి చేయలేము అని సమాధానం ఇచ్చారని ఆయన వాపోయాడు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఈ సందర్భంగా దేవ్ సింగ్ వేడుకుంటున్నాడు.