ఆత్మకూర్ (ఎస్) మండలం దాసారం గ్రామానికి చెందిన రైతు బుడగబోయిన హనుమయ్య (58) విద్యుత్ షాక్తో మృతి చెందారు. గురువారం ఉదయం తన వ్యవసాయ పొలం వద్ద మోటారును బాగు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.