కోడుమూరు పట్టణంలోని ముస్లింల స్మశాన వాటికలో బోరు తవ్వించడం పట్ల ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం బోరు తవ్వకం పనుల సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పెద్దలు మాట్లాడుతూ కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి దృష్టికి సమస్యను తీసుకెళ్లిన వెంటనే స్పందించి బోరు తవ్వించారని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారని తెలిపారు.