గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో ఇటీవల వరుసగా సంభవిస్తున్న మరణాల కారణాలను తెలుసుకోవడానికి ఎంక్వయిరీ చేస్తున్నామని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. తురకపాలెం లో కలెక్టర్ నాగలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ నీరు, మట్టి నమూనాలతో పాటు, మృతి చెందిన వారి అనారోగ్య కారణాలపై విచారణ జరుగుతోందని ఆమె చెప్పారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, అలాగే పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి చర్యలు తీసుకున్నామన్నారు.