కరీంనగర్ లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కరీంనగర్ పట్టణంలోని.. పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో గురువారం ఉదయం నుంచి మున్సిపల్ సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ సంఘటన స్థలానికి చేరుకొని సహయక చర్యలు చేపట్టారు. నగరంలోని రాంనగర్, పద్మనగర్, కోతిరాంపూర్, ఖాన్ పుర, పెద్దపల్లి బైపాస్ పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు నీట మునిగాయి. ఇప్పటి వరకు ఎక్కడ ఎలాంటి నష్టం జరగలేదని అధికారుల తెలిపారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.