కరోనా కష్టకాలంలో కూడా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు గుర్తు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. శనివారం మధ్యాహ్నం కొయ్యూరులో బాబు షూరిటీ, మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. హామీలను అమలు చేయాలని ప్రజలు నిలదీస్తే కూటమి నేతలు కేసులు పెడుతున్నారని విమర్శించారు.