తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా... తెలుగు వైతాళికుడు భాషా శాస్త్రవేత్త గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి పురస్కరించుకొని తెలుగులో సువర్ణ అక్షరాలతో శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ పట్టణానికి చెందిన స్వర్ణ సూక్ష్మ కళాకారుడు కొత్తపల్లి రమేష్ ఆచారి మరోసారి ఆయన సూక్ష్మ కళాఖండంతో అందరిని అబ్బురుపరిచాడు. సెంటీమీటర్ సైజులో ఉన్న బంగారు రేకుపై తెలుగులో స్వర్ణ అక్షరాలు తయారు చేశారు. ఇందుకు సుమారు మూడు గంటల సమయం పట్టిందని ఆయన తెలిపారు.