Parvathipuram, Parvathipuram Manyam | Aug 19, 2025
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్ మంగళవారం పార్వతీపురం మండలంలోని సాకి గెడ్డ, ఆడారి గెడ్డ, పుట్టూరు గెడ్డ తదితర గెడ్డల నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలు, అధికారులతో మాట్లాడుతూ గెడ్డలు ప్రవాహం వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. నీటి ప్రవాహంలో ఎవరు దిగరాదన్నారు. వరద ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో పర్యటించవద్దన్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వరదలు, పంట నష్టం పై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.