వాల్మీకి మహర్షి జీవితం నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి ఆదర్శమని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. మంగళవారం మడకశిర పట్టణంలో వాల్మీకి మహర్షి జయంతోత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వాల్మీకి మహర్షికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ వాల్మీకుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడం కోసం తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.