డీఎస్సీ నియామకం లో రిజర్వేషన్ విధానం గాడి తప్పిందని మెరిట్ సాధించిన ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులను ఓపెన్ కేటగిరి నుండి రిజర్వేషన్ కోటా లోకి మార్చడం జీఓ 77 కు విరుద్ధం , రోస్టర్ లో వర్టికల్ పద్ధతిలో రిజర్వేషన్ అమలు చేయాలని విదసం (విస్తృత దళిత సంఘాల)ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు డిమాండు చేసారు..సోమవారం డీఎస్సీ రిజల్ట్ వచ్చిన నేపధ్యంలో అర్హత కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు కాల్ లెటర్లు రాకపోవడంతో వారి వారి ర్యాంకు, మార్కుల జాబితాతో కూడిన వినతి పత్రాలు పట్టుకుని విదసం నేతృత్వంలో పలువురు బాదితుల కలెక్టరును ఆశ్రయించారు .