విశాఖ ఉక్కు పరిశ్రమని ఈఓఐ(ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్) పేరుతో మోడీ ప్రభుత్వ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా కార్మిక, ప్రజా సంఘాల జెఎసి రౌండ్ టేబుల్ సమావేశం సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగింది. సిఎఫ్‌టియుఐ జాతీయ అధ్యక్షులు ఎన్.కనకరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో సిపిఐ అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మృతికి సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో కార్మిక, ప్రజా సంఘాలు విశాఖ ఉక్కును ఈఒఐ ప్రైవేటీకరణను ఖండిస్తూ ప్రైవేటీకరణకు దీనికి వ్యతిరేకంగా భారీస్థాయిలో ఉద్యమం చేస్తామని ప్రకటించాయి.