వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయ నూతన కార్యనిర్వాహణాధికారి (ఈవో)గా రమాదేవి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ఈవోగా ఉన్న రాధా బాయి, రమాదేవికి ఆప్యాయంగా స్వాగతం పలికి, తన ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. నూతన ఈవోకు ఆర్డీవో రాధా బాయి,ఆలయ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. రమాదేవి గతంలో కూడా రాజన్న ఆలయ ఈవోగా పనిచేసిన అనుభవం ఉంది. అర్చకులు ఆశీర్వదించి స్వామి వారి చిత్రపటాన్ని లడ్డూను అందజేశారు.