మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో జరిగిన అవకతవకలపై శనివారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో రీజినల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా వివరాలను వెల్లడించారు. ఈ నెల 21న బ్యాంకులో క్యాష్ లో లోపాలు ఉన్నట్లుగా బ్రాంచ్ మేనేజర్ గుర్తించి తమకు సమాచారం అందించారనీ, దీంతో విచారణ చేపట్టామని తెలిపారు. క్యాషియర్ నరిగె రవీందర్ తో కలిపి 10 మంది అనుమానితుల పైన పోలీసులకు ఫిర్యాదు చేశామని, బ్యాంకులో మొత్తంగా 12 కోట్ల 61 లక్షల విలువగల బంగారం, 1,10,27,617 రూపాయల నగదు మిస్సింగ్ ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు.