అనంతగిరి ప్రాథమిక సహకార సంఘం నందు గందరగోళం నెలకొంది. యురియా బస్తాల కోసం రైతులు తెల్లవారుజామునుండే క్యూ లైన్ లో నిలబడ్డారు. నిలబడే క్రమంలో ఒకరు ముందు ఒకరు వెనుక అనే వివాదంతో రైతులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సొసైటీ వద్దకు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.. సొసైటీ పరిధిలో చాలా గ్రామాలు రైతులు ఉంటే కేవలం 270 బస్తాలు మాత్రమే ఇవ్వండం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు.