జగిత్యాల జిల్లా,కొడిమ్యాల మండల కేంద్రంలోని,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో,కాలోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు,మంగళవారం మధ్యాహ్నం నాలుగు గంటల 10 నిమిషాలకు తెలంగాణ భాషా దినోత్సవ ఉత్సవాలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వేణు మాట్లాడుతూ,విద్యార్థులు కాలోజీ నారాయణరావుని ఆదర్శం చేసుకొని తెలుగు భాష పై మక్కువ పెంచుకోవాలని తెలిపారు,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి బండ్ల భాస్కర్ మాట్లాడుతూ,విద్యార్థులు కాలోజీ నారాయణరావుని ఆదర్శంగా తీసుకొని కవిత్వాలు రాయడం నేర్చుకొని సామాజిక అభివృద్ధికి కృషి చేయాలని కోరారు,