నల్గొండ జిల్లా, కనగల్ ఎస్సై కే రాజు రెడ్డి గురువారం ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. కనగల్ మండల పరిధిలోని బోయినపల్లి వాగులో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్న జెసిపి తో పాటు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు పట్టుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కనగల్లు, బోయినపల్లి బ్రిడ్జిల కు అటు వైపు, ఇటువైపు 500 మీటర్ల వరకు ఇసుక ఎత్తితే చర్యలు తప్ప ఉన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.