అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ నిలుస్తుందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయ శ్రీ అన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతను అందించడంలో భాగంగా శనివారం ముఖ్యమంత్రి సహాయక నిధి చెక్కులను MLA నెలవలవిజయశ్రీ చేతులు మీదుగా అందించారు. MLA క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మొత్తం 30మంది లబ్ధిదారులకు రూ.22,59,799/-విలువైన చెక్కులు కూటమి ప్రభుత్వ పక్షాన అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడారు. కూటమి ప