సేవా పక్షంలో భాగంగా బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ మండల కేంద్రంలోనీ పాత హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో నిర్వహించడం జరిగింది. ఆలయం పేరుకుపోయిన చెత్త, గడ్డి తొలగించి ఆలయం కడిగి శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా OBC అధ్యక్షులు తోట బాలరాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేష్ పెరిక, బిజెపి మండల అధ్యక్షులు అనిల్, OBC జిల్లా కార్యదర్శి రాజలింగం, OBC మోర్చా కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు ఉప్పు లక్ష్మీపతి, మండల అధ్యక్షుడు చెరుకూరి సత్యం పాల్గొన్నారు.