అప్పుల బాధతో విషం తాగి రైతు ఆత్మహత్యాయత్నం అప్పుల బాధ తాళలేక విషం తాగి రైతు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ సంఘటన గురువారం సాయంత్రం కురబలకోట మండలంలో వెలుగు చూసింది. అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గం లోని, కురబలకోట మండలం, ఎర్రబెల్లికి చెందిన రైతు చంద్రశేఖర్ (48) వ్యవసాయ పంటల కోసం సుమారు 10 లక్షలు అప్పులు చేశాడు. వాటిని తీర్చలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆవుకు పిడుదులకు కొట్టే మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితున్ని మదనపల్లికి తరలించారు