అనకాపల్లి జిల్లా చోడవరం రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ కళ్యాణపులోవ, టీ.అర్జాపురం పంచాయతీలో గురువారం విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ అమరవీరుల చిత్రపటాలకు నివాళి అర్పించారు. 2000 సంవత్సరంలో బషీర్ బాగ్లో జరిగిన విద్యుత్ ఉద్యమ పోరాటంలో ముగ్గురు తుపాకీల తూటాలకు బలయ్యారని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే.గోవిందరావు అన్నారు. అమరుల స్ఫూర్తితో పోరాటాలు చేస్తామని అన్నారు.