భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి జిఎం కార్యాలయం ముందు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు బిఎంఎస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టినట్లు బి ఎం ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పని శ్రీనివాస్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటాను 40 శాతం చెల్లించాలని, కార్మికుల సౌకర్యం హనుమకొండలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించి సింగరేణి సంస్థ నడిపించాలని, కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెంచి వారి సమస్యలు పరిష్కరించాలని బిఎమ్ఎస్ యూనియన్ డిమాండ్ చేస్తుందన్నారు శ్రీనివాస్.వెంటనే సమస్యలు పరిష్కరించాలని లేనియెడల దశలవారీగా యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామన్నారు.