శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షిమండల కేంద్రమైన లేపాక్షి లోని 544 ఈ జాతీయ రహదారిలో హిందూపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జనార్ధన్ ఆధ్వర్యంలో ఎస్సై చెన్నయ్య ఇతర పోలీసులతో కలిసి వాహనాలు తనిఖీ చేపట్టారు. ద్విచక్ర వాహనాలు, ఎక్కువమంది ప్యాసింజర్ లను తీసుకెళ్తున్న ఆటోలు, ఇతర వాహనాలను తనిఖీ చేస్తూ అపరాధ రుసుములను వసూలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులకు హెల్మెట్ వాడకం సీట్ బెల్ట్ ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు.