నల్లగొండ జిల్లా అనుముల మండలం కొత్తపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం గురువారం రైతులు బారులు తీరారు. వారం రోజులపాటు కాలువ నీరు లేక ఇబ్బందులు పడ్డామని ఇప్పుడు యూరియా కోసం గంటల తరబడి పైగా కాయాల్సి వస్తుందని పలువురు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మూడు బస్తాలు మాత్రమే ఇచ్చి మిగతా వాటికి రేపు రమ్మని అధికారులు చెబుతుండడం పై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.