ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం అన్నసముద్రం మిట్ట వద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం బుధవారం ఢీకొన్న సంఘటన తెలిసినదే. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు సాల్మన్ రాజు కొండమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో వారి ఇద్దరి పిల్లలు అనాధాలు అయ్యారని కుటుంబ సభ్యులు రోదించారు. వారి కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.