నల్గొండ జిల్లా, నేరేడుగొమ్ము మండలం, సాగర్ బ్యాక్ వాటర్ లో పనిచేస్తున్న 30 మంది వలస కార్మికులకు దేవరకొండ పోలీస్ రెస్క్యూ ఆపరేషన్ ద్వారా ఆదివారం సాయంత్రం విముక్తి కలిగించారు. జీవనోపాధి కోసం, బీహార్, జార్ఖండ్, చతిస్గడ్ రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా కొంతమంది కాంట్రాక్టర్లు చేపలు పట్టే పనిలో దింపి వెట్టి చాకిరి చేయిస్తున్నారని పోలీసులు తెలిపారు. వలస కార్మికుల వివరాలను సేకరించి వారికి పోలీసులు సంరక్షణ కల్పించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.