కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి లో పారిశుధ్యం పడకేసింది. గత ఐదు నెలలుగా జీతాలు ఇవ్వలేదని వేంపల్లి గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు. రెండు రోజులుగా వేంపల్లి పట్టణంలో చెత్తను ఎత్తకపోవడం వల్ల ప్రధాన రహదారిలో, ప్రభుత్వ పాఠశాల నందు చెత్తకుప్పలు పేరుకుపోయాయి. దీనితో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులతో సహా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఐదు నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని 15 నెలల నుండి పిఎఫ్ అమౌంట్ కూడా జమ అవడం లేదని వెంటనే మాకు రావాల్సిన డబ్బులు జమ చేసి జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పరిశుద్ధ కార్మికులు వేడుకున్నారు.