బాపట్ల జిల్లాలో యూరియాకు కొరత లేదని కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. యూరియా నిల్వలపై బుధవారం సీఎం చంద్రబాబు సచివాలయం నుండి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొని జిల్లాలో పరిస్థితి వివరించారు. జిల్లాకు సెప్టెంబర్ లో అవసరమైన 6,759 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా అంత మొత్తం అందుబాటులో ఉందన్నారు. యూరియాను బ్లాక్ మార్కెట్ చేసే వ్యాపారులపై పీడీ యాక్ట్ పెడతామని కలెక్టర్ హెచ్చరించారు.