అర్ధరాత్రి తాచుపాము హల్చల్ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండల కేంద్రంలో గురువారం రాత్రి 12 గంటల సమయంలో చోటుచేసుకుంది.. మండల కేంద్రంలోని ఓ ఇంట్లో కుక్కలు అరుస్తుండగా స్థానిక మహిళలు చూడగా తాచుపామును గమనించారు.పాము స్కూటీలోకి వెళ్లడంతో కొత్తగూడెం పట్టణానికి చెందిన స్నేక్ క్యాచర్ సంతోష్ కి సమాచారం అందించారు.. అక్కడికి చేరుకున్న సంతోష్ సుమారు రెండున్నర గంటలకు కష్టపడి తాచుపామును పట్టుకున్నారు..పాముల గురించి స్థానికులకు వివరించి సురక్షితంగా పామును అడవిలో విడిచిపెట్టినట్లు సంతోష్ శుక్రవారం ఉదయం 9:30 సమయంలో తెలిపారు..