రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయిన్పల్లి మండలం, నీలోజుపల్లి గ్రామ శివారులో బుధవారం 9 PM కి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన చోటు చేసుకుంది,జగిత్యాల కు చెందిన రమేష్ నీలోజ్ పల్లి నుండి ద్విచక్ర వాహనంపై జగిత్యాలకు వెళ్తుండగా, కరీంనగర్ కు చెందిన వేణు అతని స్నేహితుడు ద్విచక్ర వాహనంపై కరీంనగర్ వెళ్తుండగా,గ్రామ శివారులో రమేష్ తన ద్విచక్ర వాహనంతో వేణు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టాడు,దీంతో రెండు ద్విచక్ర వాహనాలపై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వేణు స్నేహితుడి పరిస్థితి విషమంగా మారింది,దీంతో ముగ్గురిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు,