నంద్యాల జిల్లా సంజామల మండలం కానాల గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త మేడిగ డేనియల్ ఇటీవల ప్రమాదంలో మృతి చెందాడు. అతనికి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన నాయకులు పత్తి సురేష్ బాబు, భాస్కర్, గురప్ప, వేణు, మహబూబ్ బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును గురువారం అందజేశారు.