కరీంనగర్ పర్యటనకు వచ్చిన బిజెపి చీఫ్ రామచందర్ రావు మీడియాతో బుధవారం మాట్లాడారు. కవిత ను బిఆర్ఎస్ పార్టీ నుంచి తీసేయడం వారి పార్టీ వ్యక్తిగత విషయమని, బిఆర్ఎస్ పార్టీలోని అవినీతిని వాళ్ళే తోడు కుంటున్నారని వేరే పార్టీ వాళ్లు తోడే అవసరం లేదని అన్నారు. ప్రజలు బిఆర్ఎస్ పార్టీని రాజకీయంగా తిరస్కరించారని, ఆ పార్టీకి మనుగాడ లేదని అన్నారు.అవినీతిపరులను బిజెపి పార్టీలోకి తీసుకోమని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు కట్టడంలో నాణ్యత, అవినీతి, మెయింటెనెన్స్ పై విచారణ జరగాలని అన్నారు. ప్రాజెక్టుపై సిబిఐ విచారణను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాడే అడిగామని అన్నారు.