గణపతి నిమజ్జనం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శోభాయాత్రకు సంబంధించి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను నిమజ్జన ప్రాంతాల శోభాయాత్ర నిర్వహించే మార్గాలను ప్రస్తుత స్థితిగతులపై పోలీస్ కమిషనర్ పర్యవేక్షించారు. మరోవైపు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి మేయర్ గుండు సుధారాణి నిమజ్జనాన్ని పర్యవేక్షించారు.