హనుమంతునిపాడు :గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో ఎన్టీఆర్ రూపంలో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహావిష్కరణను హనుమంతునిపాడు మాజీ జడ్పీటీసీ సభ్యులు, సమాజ్వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాశం వెంకటేశ్వర్లు తప్పు పట్టారు.ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం ఏర్పాటుచేసి సమాజానికి టీడీపీ నాయకులు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం మంచి పద్ధతి కాదన్నారు. ఇటువంటి చర్యలను ఆపకపోతే ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరించారు.