ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయొద్దని పీడీఎఫ్ మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు కోరారు. గుంటూరులో ఆయన రౌండ్ టేబుల్ సమావేశంలో మండిపడ్డారు. ఇప్పటికే 90% మెడికల్ కాలేజీలు ప్రైవేటు చేతుల్లో ఉండగా, మిగిలిన ప్రభుత్వ కాలేజీలను కూడా విక్రయించడం అన్యాయం అని విమర్శించారు. ఇలా జరిగితే పేదలకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందని అన్నారు. కేంద్రం నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు.