జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు శిధిలావస్థకు వచ్చిన భవనాలను పరిశీలించి జిల్లా ఉన్నతాధికారులు నూతన భవనాల ఏర్పాటుకు కృషి చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ కోరారు.ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయం సూపర్డెనెంట్ శ్రీధర్ కు సమస్యలుతో కూడిన వినతిపత్రం అందచేశారు. ఈ అజిత్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు అర కోర వసతులతో నడుస్తున్నాయని కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు.