రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీన అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిణి డాక్టర్ పీ.రోహిణి శుక్రవారం తెలిపారు. అపోలో ఫార్మసీ, నవత రోడ్డు ట్రాన్స్ పోర్ట్ తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొని నిరుద్యోగ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఆపై చదువులు పూర్తిచేసిన నిరుద్యోగ అభ్యర్థులు హాజరు కావాలన్నారు.