శృంగవృక్షం శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మందిరంలో మంగళవారం ఉండి నియోజకవర్గంలో క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రైస్ కార్డులను శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ ప్రభుత్వం రేషన్ పంపిణీని మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించే లక్ష్యంగా పాత కార్డులు స్థానంలో రాజముద్రతో ఏటీఎం కార్డు సైజు లో ముద్రించిన క్యూఆర్ కోడ్ కలిగిన కొత్త రైస్ కార్డులను అందుబాటులో తీసుకొచ్చిందన్నారు.