ఆన్లైన్ బెట్టింగ్ గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్, SR నగర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. నిషేధిత ఖేలో గేమింగ్ యాప్స్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా 8 మందిని అరెస్ట్ చేయగా మరో ఇద్దరు పరారయ్యారు. 18 మొబైల్ ఫోన్లు, 3 పాస్బుక్స్, 13 ఏటీఎం కార్డులను సీజ్ చేశారు. ఆన్లైన్ లావాదేవీల నగదు రూ.29,81,000ను పోలీసులు బ్లాక్ చేశారు.