జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మండల కేంద్రంలో రేషన్ డీలర్ సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్ గౌడ్ కు సోమవారం వినతిపత్రం ఇచ్చారు. రేషన్ డీలర్లకు 5 నెలలుగా కమీషన్ డబ్బులు ప్రభుత్వం చెల్లించడం లేదని వారు పేర్కొన్నారు. రేషన్ సరుకులు పంపిణీకి ఎంతో శ్రమకూర్చి గంటల తరబడి దుకాణాల్లో ఉంటున్నామని, కమీషన్ డబ్బులు చెల్లించడంలో జాప్యం చేయడం సమంజసం కాదన్నారు.ఈ కార్యక్రమంలో రీజన్ డీలర్లు చిన్నయ్య, జలంధర్, మారుతి ఉన్నారు.