సేవా పక్షం ద్వారా పేద ప్రజలకు మంచి కార్యక్రమాలు ప్రారంభించడం అభినందనీయమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంత్రి కుంటలో బతుకమ్మ ఘాట్ ఎంపీ ప్రారంభించారు. అనంతరం మాదారంలో పంచముఖ హనుమాన్ ఆలయం వద్ద ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు రామన్న సింగ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గోదావరి అంజిరెడ్డి, జగన్ రెడ్డి తదితరులు ఉన్నారు.