గూడూరు ఇందిరా నగర్‌లో బుధవారం రాత్రి వాలంటీర్ దీపిక ఇంటికి తాళాలు వేసి సమీపంలోని తల్లి ఇంటికి వెళ్ళింది. తన భర్త లేని రోజుల్లో ఆమె తల్లి వద్దనే ఉంటుంది. ఇది గుర్తించిన దొంగలు రాత్రి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. రూ.లక్షా 64 వేల నగదు, కొన్ని వెండి వస్తువులను చోరీ చేశారు. పక్కనే ఉన్న ఇంట్లో కూడా చోరీకి యత్నించారు.