జుక్కల్ నియోజవర్గం నిజాంసాగర్ మండలం బంజపల్లికి చెందిన వడ్ల రవీందర్ (42) సంవత్సరాలు మృతదేహం శుక్రవారం ఉదయం లభ్యమైంది. బుధవారం సాయంత్రం నాగమడుగులో కాలకృత్యాలకు వెళ్లి గల్లంతయ్యాడు. నిజంసాగర్ మండల ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, దర్యాప్తు చేస్తున్నట్లు నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ పేర్కొన్నారు.