అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోగల బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేట కాజ్వే కొట్టుకుపోయి 25 రోజులు కావస్తున్నా పునరుద్ధరణ పనులు ప్రారంభం కాలేదు. వడ్డాది నుంచి చోడవరం వైపు వెళ్లే వారు గౌరీపట్నం సింగిల్ రోడ్డులో ఆటోలులో వెళ్లాల్సి వస్తోంది. తరుచూ ఈ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. కాజ్వే పునరుద్ధరణకు రూ.17.5లక్షలు మంజూరయ్యాయని, టెండర్ ఖరారు అయితే పనులు ప్రారంభిస్తామని ఆర్ అండ్ బి జేఈ సత్యప్రసాద్ తెలిపారు.