చంద్రశేఖరపురం: నంద్యాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కనిగిరి నియోజకవర్గం మండల కేంద్రమైన చంద్రశేఖరపురం గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రశేఖరపురం గ్రామానికి చెందిన బండారు దేవదాస్ అనే వ్యక్తి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పనుల్లో భాగంగా నంద్యాల వెళ్ళాడు . అయితే దేవదాసు వాకింగ్ చేస్తున్న సమయంలో వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దేవదాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.