అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోగల చోడవరం పట్టణంలో ఉన్న స్వయంభు విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో మూల విరాట్ విగ్రహం వద్దకు భారీగా నీరు చేరుకుంది సగం వినాయకుని విగ్రహం నీట మునిగింది. ఆలయం చుట్టూ ఎక్కడ నీరు లేకపోయినా మూలవిరాట్ విగ్రహం వద్ద నీరు చేరింది. మూల విరాట్ విగ్రహం వినాయకుని తొండం ఏనుగుబోతు చెరువు వరకు ఉంటుందని పూర్వీకులు అర్చకులు చెబుతుంటారు. తొండం ద్వారానే మూలవిరాట్ విగ్రహం వరకు నీరు చేరిందని భక్తులు విశ్వాసం గా నమ్ముతున్నారు.