తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం సురపు అగ్రహారం గ్రామం ఫారెస్ట్ ఏరియాలో డ్రోన్ కెమెరా సహాయంతో జల్లెడ పట్టారు. ఈ క్రమంలో ఓ చోట పేకాట ఆడుతున్న ఐదుగురు ముద్దాయిలను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4130/- నగదు సీజ్ చేయడం జరిగిందని దొరవారిసత్రం ఎస్సై అజయ్ కుమార్ తెలిపారు. మండలంలో జూదాలు, నిషేధిత మత్తు పదార్థాల వాడకం రవాణా వినియోగంతో పాటు నేరాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు అనుమానిత వ్యవహారాల గురించి తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని దొరవారి సత్రం మండలం ఎస్సై అజయ్ కు