జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దెందుకు జిల్లా ఎస్.పి అశోక్ కుమార్ పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లాలోని ఆయా సబ్ డివిజన్ల డి.ఎస్.పి ల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గంజాయి సేవించే, విక్రయించే అవకాశమున్న ప్రాంతాలు, ప్రదేశాలలో అత్యాధునిక డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ అనుమానాస్పద వ్యక్తులకై ఆరా తీశారు. కిరానా షాపులు, గోడౌన్ లు, పాడుబడ్డ క్వార్టర్ లు, భవనాలలో గంజాయి సేవించే, విక్రయించే వారి కోసం సిబ్బందితో అణువణువూ అన్వేషిస్తున్నారు.