వరదలు సంభవించి రెండువారాలు గడిచినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి ఎలాంటి స్పందన లేదని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తాడ్వాయి మండల సంతాయిపేట్ గ్రామంలో భారీ వరదలకు కొట్టుకుపోయిన పంట పొలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. తక్షణమే పంట నష్టపోయిన రైతులకు ఎకరాలకు రూ.లక్ష పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఎండ్రియల్ గ్రామంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పత్తి, సోయాబీన్, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. వరద బీభత్సానికి వందల ఎకరాల్లో ఇసుక మేటలు వేసిందని, రాళ్లు మట్టి పేరుకుపోయాయన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి లక్ష సాయం అందించాలని డిమాండ్ చేశార