మదనపల్లె పట్టణంలో సోమవారం పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించారు. వినాయక చవితి పండుగలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు డి.ఎస్.పి మహేంద్ర ఆదేశాలతో పోలీసులు పట్టణంలోని వెంకటేశ్వర స్వామి గుడి, నెహ్రూ బజార్, బెంగళూరు బస్టాండ్, చిత్తూరు బస్టాండ్, అప్పారావు స్ట్రీట్ తదితర ప్రాంతాలలో రూట్ మార్చ్ నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సూచించారు. వన్ టౌన్ సీఐ మహమ్మద్ రఫీ, టూ టౌన్ సీఐ కె.రాజా రెడ్డి, తాలూకా సీఐ కళా వెంకటరమణ, ట్రాఫిక్ సిఐ గురునాథ్ మరియు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.